Parkal: పరకాల శ్రీ వాసవి ఆలయంలో ఘనంగా సామూహిక సత్యనారాయణ వ్రతాలు!
Parkal: కార్తీక పౌర్ణమి సందర్భంగా పరకాల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు, సూదం రఘువీర్ దంపతుల ఆధ్వర్యంలో అన్నదానం జరిగాయి.
Parkal: పరకాల శ్రీ వాసవి ఆలయంలో ఘనంగా సామూహిక సత్యనారాయణ వ్రతాలు!
పార్కళ్: కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలుపరకాల కార్తీక పౌర్ణమి సందర్భంగా పరకాల పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించడం జరిగింది.ఆలయ ప్రాంగణంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సామూహిక వ్రతాలు చేశారు.వ్రతాల అనంతరం సూదం రఘువీర్ దంపతుల ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భక్తులందరికీ అన్నదానం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు చిటికెశి కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శి ఎక్కటి రమేష్, కోశాధికారి ఒమ క్రిష్ణ మోహన్ పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతం కావడానికి అహర్నిశలు కృషి చేసిన వారందరికీ ఆలయ కమిటీ కృతజ్ఞతలు తెలియచేసింది.ఈ సందర్భంగా ఆలయ కమిటీ భక్తులకు, దాతలకు, సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియచేసింది. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు కృషి చేస్తామని తెలిపారు.




