Mahabubabad: మహబూబాబాద్‌లో వైభవంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగాయి. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి మహిళలు, యువతులు ఉత్సాహంగా ఆడపాడారు.
Mahabubabad: మహబూబాబాద్‌లో వైభవంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు
మహబూబాబాద్: తీరొక్క పూలతో మహిళలు బతుకమ్మలను అందంగా పేర్చి శోభా యాత్రగా ఆలయాలకు చేరుకొని ఒక చోట చేర్చి కోలాటాలు , ఆట పాట లతో అంగరంగ వైభవంగా ఎంగిలి పూల బతుకమ్మ పండుగను జరుపుకున్న సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రం లో చోటు చేసుకుంది.
మహబూబాబాద్ పట్టణం లోని మూడు కొట్ల సెంటర్ లో డి.జే లైట్లు , డి.జే పాటలకు చిన్నారులు , యువతులు, మహిళలు కోలాటాలు , నృత్యాల తో హోరోత్తించారు.
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు బతుకమ్మ నిలువెత్తు నిదర్శనంగా నిలువడమే గాకుండా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సహజ సిద్ధమైన పూలను ఆరాధించే గొప్ప వేడుక బతుకమ్మ. ఎక్కడెక్కడో స్థిరపడిన మహిళలంతా తమ తల్లిగారింటికి చేరుకొని 9 రోజుల పాటు ఆడిపాడి సందడి చేయనున్నారు.




