Parkala: పరకాలలో అంగరంగ వైభవంగా దుర్గామాత నిమజ్జనోత్సవం!

Parkala: హనుమకొండ జిల్లా పరకాలలో ఘనంగా ముగిసిన దసరా ఉత్సవాలు. శ్రీ భవాని కుంకుమేశ్వర దేవస్థానంలో దుర్గామాత నిమజ్జనోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహణ.

M PRABHAKAR, PARAKAL
Published on: 21 Oct 2026 12:19 PM IST
Parkala
X

Parkala: పరకాలలో అంగరంగ వైభవంగా దుర్గామాత నిమజ్జనోత్సవం!

Parkala: పరకాల పట్టణంలో దసరా ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ భవాని కుంకుమేశ్వర దేవస్థానంలో కొలువైన దుర్గామాత నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది.

నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కుంకుమార్చనలు నిర్వహించారు. చివరి రోజు అమ్మవారికి మహా హారతి, పూర్ణాహుతి నిర్వహించిన అనంతరం నిమజ్జనానికి బయలుదేరారు.

డప్పు చప్పుళ్లు, మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాహలం, జై దుర్గా నినాదాల నడుమ అమ్మవారి ఊరేగింపు పట్టణ పురవీధుల గుండా సాగింది. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారికి పూలు, కొబ్బరికాయలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

M PRABHAKAR, PARAKAL

M PRABHAKAR, PARAKAL