Maripeda: మరిపెడ మున్సిపాలిటీలో ఘనంగా మహా అన్నదానం!
Maripeda: మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని కౌన్సిలర్ బోడ భాస్కర్ ఆధ్వర్యంలో మహా అన్నదానం ఘనంగా నిర్వహించారు.
Maripeda: మరిపెడ మున్సిపాలిటీలో ఘనంగా మహా అన్నదానం!
Maripeda: వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో మహా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 5వ వార్డు కౌన్సిలర్ బోడ భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి రెడ్యానాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్‌రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పట్టణ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కౌన్సిలర్ బోడ భాస్కర్ దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. పట్టణ ప్రజల సహకారంతో కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య విజయవంతంగా ముగిసింది.




