Warangal: రామన్నపేటలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు కేంద్రం ప్రారంభం!

Warangal: వరంగల్ పశ్చిమ నియోజకవర్గం రామన్నపేటలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు కేంద్రాన్ని ప్రారంభించిన మాజీ కుడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, బీఆర్ఎస్వీ ప్రశాంత్.

MD. AMEER, WARANGAL EAST
Published on: 7 Oct 2026 3:25 PM IST
Warangal
X

Warangal: రామన్నపేటలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు కేంద్రం ప్రారంభం!

Warangal: వరంగల్ పశ్చిమ నియోజకవర్గం, 29వ డివిజన్ రాజీవ్ గాంధీ నగర్, రామన్నపేటలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ (వరంగల్-నల్గొండ-ఖమ్మం) ఓటర్ల నమోదు కేంద్రాన్ని మాజీ కుడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, బీఆర్ఎస్వీ అధ్యక్షుడు ప్రశాంత్ సంయుక్తంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా మర్రి యాదవ రెడ్డి మాట్లాడుతూ.. 29వ డివిజన్ పరిధిలో డిగ్రీ, బీటెక్, డిప్లొమా పూర్తి చేసిన గ్రాడ్యుయేట్లు అందరూ ఈ నమోదు కేంద్రానికి వచ్చి తమ ఓటును నమోదు చేసుకోవాలని సూచించారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కన్వీనర్లు, బీఎల్ఏలు ఇంటింటికీ వచ్చి ఎమ్మెల్సీ ఓటును ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా నమోదు చేస్తారని, ఈ అవకాశాన్ని గ్రాడ్యుయేట్లు తప్పకుండా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో 29వ డివిజన్ అధ్యక్షుడు కొడకండ్ల సదానంద్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వడిచర్ల ప్రసాద్, రాచర్ల రాము, ఎండి షఫీ, తాళ్లపల్లి రమేష్, రాచర్ల జగన్, గట్టు చందు, పూజారి కుమారస్వామి, ఇజగిరి భీమరాజ్, మాల్వే రాజు, బుస శేఖర్, ఎండి జావిద్, ఎస్కే రహమాన్, నాగమణి, పూజారి సారంగం, సూరం గోపి, వెంకన్న, కొండ శ్రీనివాస్, ముప్పకాంతయ్య, వడిచర్ల దత్తు, బుస రాజు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

MD. AMEER, WARANGAL EAST

MD. AMEER, WARANGAL EAST