Hanumakonda: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీల మద్దతు కోరిన అశోక్ కుమార్ గౌడ్!
Hanumakonda: వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అశోక్ కుమార్ గౌడ్ హన్మకొండలో బీసీ సంక్షేమ సంఘం నాయకులను కలిసి మద్దతు కోరారు.
Hanumakonda: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీల మద్దతు కోరిన అశోక్ కుమార్ గౌడ్!
Hanumakonda: నేడు హన్మకొండ నయీమ్ నగర్ బిసి సంక్షేమ సంఘం కార్యాలయంలో తెలంగాణా రాజ్యధికార (తీన్మార్ మల్లన్న) పార్టీ నుండి వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గా పోటీ చేస్తున్న పాలకూరి అశోక్ కుమార్ గౌడ్,
బిసి సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ ను కలిసి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో బిసిలందరు తెలంగాణ రాజ్యధికార పార్టీకి మద్దత్తు ఇవ్వాలని కోరారు.
ఈ సందర్బంగా అశోక్ గౌడ్ మాట్లాడుతూ ప్రధాన పార్టీలు అన్ని అగ్రవర్ణాలకు టికెట్లు కేటాయిస్తున్నాయని, జనాభాలో 60% ఉన్న బిసిల పట్ల అన్ని రాజకీయ పార్టీలు చిన్న చూపు చూస్తున్నాయని అభిప్రాయపడ్డారు.
బీసీలకు రాజ్యధికారమే లక్ష్యంగా మా పార్టీ పని చేస్తుందుని అన్నారు. నీను ఒక బిసి బిడ్డగా మీ ముందుకు వస్తున్న నన్ను ఆశీర్వదించాలని కోరారు.




