Mahabubabad: మహబూబాబాద్ ఆసుపత్రిలో ఆయుష్ ఉచిత వైద్య శిబిరం!

Mahabubabad: మహబూబాబాద్ జనరల్ ఆసుపత్రిలో 11వ ఆయుష్ దినోత్సవం సందర్భంగా ఉచిత వైద్య శిబిరం. 412 మందికి పరీక్షలు, ఆయుర్వేద మందుల పంపిణీ, ఔషధ మొక్కల ప్రదర్శన.

A.Rajkumar, Mahabubabad
Published on: 23 Sept 2026 7:56 PM IST
Mahabubabad
X

Mahabubabad: మహబూబాబాద్ ఆసుపత్రిలో ఆయుష్ ఉచిత వైద్య శిబిరం!

మహబూబాబాద్: 11వ అంతర్జాతీయ ఆయుష్ (ఆయుర్వేద) దినోత్సవం సందర్భంగా బుధవారం మహబూబాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రి ప్రాంగణంలో ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాన్ని ఆయుష్ శాఖ సంచాలకులు మరియు ప్రాంతీయ ఉప సంచాలకుల ఆదేశాల ప్రకారం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్బంగా నోడల్ అధికారి డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఈ ఉచిత ఆరోగ్య శిబిరంలో 412 మందికి పైగా రోగులకు వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి, వారి ఆరోగ్య సమస్యలకు అనుగుణంగా ఉచితంగా ఆయుర్వేద మరియు హోమియోపతి మందులను పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. అంతేకాకుండా, వివిధ రుగ్మతలతో బాధపడుతున్న బాధితులకు వారి వ్యాధుల తీవ్రతను బట్టి ప్రత్యేక యోగాసనాలు మరియు యోగా శిక్షణను కూడా అందజేయడం జరిగింది.విశేషంగా ఆకట్టుకున్న మూలికా మొక్కల ప్రదర్శన

శిబిరంలో భాగంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆయుర్వేద ఔషధ మొక్కల ప్రదర్శన సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంది. వివిధ రకాల నిత్య జీవితంలో ఉపయోగపడే మూలికలు, వాటి వైద్య విలువలు మరియు ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రజలకు వివరంగా తెలియజేశారు. ఈ ప్రదర్శనకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.

ఈ సందర్భంగా ఆయుష్ వైద్య విధానాల విశిష్టతను మరియు రోజువారీ జీవితంలో యోగా యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు. ఈ శిబిరంలో డాక్టర్ సుజాత, డాక్టర్ శ్రీవిద్య, డాక్టర్ రామకృష్ణ, డిపియం శ్రవణ్ కుమార్, సిబ్బంది కిషన్, ప్రవీణ్, సోములు, రవీందర్, వీరన్నలతో పాటు యోగా శిక్షకులు హేమ సుందర్ కమల్, జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.

A.Rajkumar, Mahabubabad

A.Rajkumar, Mahabubabad