Rayaparthy: గన్నారం గ్రామంలో గత 15 ఏళ్లుగా వీడని తీవ్ర తాగునీటి సమస్య!

Rayaparthy: వరంగల్ జిల్లా రాయపర్తి మండలం గన్నారంలో తీవ్ర తాగునీటి సమస్య. గత 15 ఏళ్లుగా అష్టకష్టాలు పడుతున్నామని, వెంటనే పరిష్కరించాలని ప్రజల ఆవేదన.

P ASHOK, WARDHANNAPET
Published on: 26 Sept 2026 8:52 AM IST
Rayaparthy
X

Rayaparthy: గన్నారం గ్రామంలో గత 15 ఏళ్లుగా వీడని తీవ్ర తాగునీటి సమస్య!

Rayaparthy:రాయపర్తి మండలంలోని గన్నారం గ్రామ ప్రజలు గత 15 సంవత్సరాలుగా తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాలకులు మారుతున్నా, సర్పంచులు మారుతున్నా గ్రామంలోని నీటి సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గతంలో మూడు టర్ములుగా సర్పంచులు బాధ్యతలు నిర్వహించినప్పటికీ, గ్రామంలో నెలకొన్న నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపలేకపోయారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా వేసవికాలంలోనే కాకుండా వర్షాకాలంలో కూడా నీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది.

గ్రామంలో తాగునీటి సమస్యపై విలేజ్ సెక్రటరీ, ఎంపీడీవో అధికారులకు పలుమార్లు సమస్యను వివరించినప్పటికీ, ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం లభించలేదని గ్రామస్తులు చెబుతున్నారు.

వర్షాలు కురుస్తున్న సమయంలో కూడా నీటి సమస్య కొనసాగుతుండటంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి గ్రామంలోని నీటి సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించి, శాశ్వత పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలని గన్నారం గ్రామ ప్రజలు కోరుతున్నారు.

P ASHOK, WARDHANNAPET

P ASHOK, WARDHANNAPET