Dornakal: డోర్నకల్‌లో గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు!

Dornakal: డోర్నకల్‌లో ప్రశాంతంగా వినాయక నిమజ్జనం నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు. డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేసిన తొర్రూరు డీఎస్పీ కృష్ణ కిషోర్.

P PRABHAKAR, DORNAKAL
Published on: 18 Sept 2026 9:33 AM IST
Dornakal
X

Dornakal: డోర్నకల్‌లో గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు!

Dornakal: వినాయక నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తొర్రూరు డివిజన్ పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తొర్రూరు డీఎస్పీ కృష్ణ కిషోర్ తెలిపారు.

డోర్నకల్ నియోజకవర్గ పరిధిలోని నిమజ్జన ప్రదేశాల్లో భద్రతా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. నిమజ్జన ప్రదేశాల్లో బారికేడ్లు, లైటింగ్‌ ఏర్పాటు చేయడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

గణేష్ విగ్రహాలను నిమజ్జనానికి తరలించే సమయంలో డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ప్రతి గణేష్ మండపం నిర్వాహకులపై పోలీసుల నిఘా ఉంటుందని పేర్కొన్నారు. నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అప్రమత్తంగా ఉంటారని తెలిపారు.

ప్రజలు పోలీసులకు సహకరించాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని డీఎస్పీ కృష్ణ కిషోర్ కోరారు.

P PRABHAKAR, DORNAKAL

P PRABHAKAR, DORNAKAL