Bhupalpally: రెండు లక్షల ఉద్యోగాల హామీ అమలు చేయాలి..గండ్ర డిమాండ్!

Bhupalpally: యూత్ డిక్లరేషన్‌లో ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాల హామీని అమలు చేసి, వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని భూపాలపల్లిలో మాజీ ఎమ్మెల్యే గండ్ర డిమాండ్ చేశారు.

Bhoomi Reddy, Bhupalpally
Published on: 23 Nov 2026 1:46 PM IST
Bhupalpally
X

Bhupalpally: రెండు లక్షల ఉద్యోగాల హామీ అమలు చేయాలి..గండ్ర డిమాండ్!

Bhupalpally: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో యూత్ డిక్లరేషన్‌లో భాగంగా రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి brs నాయకులు రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికార పదవులను అనుభవిస్తున్నప్పటికీ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించే విషయంలో మాత్రం ప్రభుత్వం జాప్యం చేస్తోందని విమర్శించారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా భూపాలపల్లిలోని గ్రంథాలయాన్ని సందర్శించిన నాయకులు అక్కడి విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారికి పుస్తకాలను పంపిణీ చేశారు. సింగరేణి జీఎం కార్యాలయంలో పట్టభద్రులను కలిసి తమ అభ్యర్థికి ఓటు వేయాలని అభ్యర్థించారు. అదే విధంగా సింగరేణి ఆసుపత్రిని సందర్శించి రోగులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు వైద్యులను కలిసి ఓటు అభ్యర్థించారు.

అనంతరం సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

నిరుద్యోగ యువతకు న్యాయం జరిగేలా జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోరారు. ఈ అంశంపై ప్రభుత్వానికి తమ నిరసన, డిమాండ్‌ను తెలియజేయడంలో భాగంగానే కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు.

Bhoomi Reddy, Bhupalpally

Bhoomi Reddy, Bhupalpally