Rayaparthy: కొత్తూరులో పారిశుద్ధ్య కార్మికులకు ఘన సత్కారం!
Rayaparthy: రాయపర్తి మండలం కొత్తూరులో ఘనంగా గాంధీ జయంతి గ్రామాన్ని స్వచ్ఛంగా ఉంచుతున్న పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సత్కరించిన సర్పంచ్ కందికట్ల స్వప్న.
Rayaparthy: కొత్తూరులో పారిశుద్ధ్య కార్మికులకు ఘన సత్కారం!
రాయపర్తి: వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొత్తూరు గ్రామంలో గాంధీ జయంతిని పురస్కరించుకుని గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు నిరంతరం సేవలందిస్తున్న గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులను గ్రామ సర్పంచి కందికట్ల స్వప్న ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మా గాంధీ ఆశయాల్లో పరిశుభ్రతకు ఎంతో ప్రాధాన్యత ఉందని, గ్రామాల పరిశుభ్రత కోసం పారిశుద్ధ్య కార్మికులు అందిస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.




