Wardhannapet: నల్లబెల్లిలో గాంధీ జయంతి వేడుకలు, ప్రత్యేక గ్రామసభ నిర్వహణ!

Wardhannapet: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం నల్లబెల్లిలో గాంధీ జయంతి సందర్భంగా సర్పంచ్ జక్కి అనిత శ్రీకాంత్ ఆధ్వర్యంలో తడి, పొడి చెత్తపై అవగాహన కల్పించారు.

P ASHOK, WARDHANNAPET
Published on: 2 Oct 2026 5:32 PM IST
Wardhannapet
X

Wardhannapet: నల్లబెల్లిలో గాంధీ జయంతి వేడుకలు, ప్రత్యేక గ్రామసభ నిర్వహణ!

Wardhannapet: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామంలో మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని ప్రత్యేక గ్రామసభ ఏర్పాటు చేసిన అనంతరం గ్రామ ప్రజలకు స్వచ్ఛతపై అవగాహన కల్పించడం కోసం గ్రామ సర్పంచ్ జక్కి అనిత శ్రీకాంత్ ఆధ్వర్యంలో గ్రామ బస్టాండ్ ప్రాంగణంలో నూతనంగా రచ్చబండలను నిర్మించడం జరిగింది.

గ్రామ ప్రజలకు స్వచ్ఛతపై అవగాహన కల్పించడం కోసం రచ్చబండలపై తడి చెత్త పొడి చెత్త సానిటరీ చెత్త ప్రత్యేక చెత్త గురించి ప్రభుత్వ మార్గదర్శకాలను వివరిస్తూ గద్దెలను నిర్మించడం జరిగింది. నేడు వాటిపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పిస్తూ స్వచ్ఛతపై నాలుగు రకాల వ్యర్థాలను వేరుగా చేసి ఇంటి శుభ్రత పరిసరాల పరిశుభ్రత పాటించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ మేకల దేవేందర్ గ్రామ కార్యదర్శి షేక్ హుస్సేన్ గ్రామ వార్డు మెంబర్లు గ్రామస్థాయి అధికారులు మహిళా సంఘాలు గ్రామ ప్రజలు యువకులు తదితరులు పాల్గొన్నారు.

P ASHOK, WARDHANNAPET

P ASHOK, WARDHANNAPET