Jangaon: జనగామ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు!

Jangaon: జనగామ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి, స్వచ్ఛతే సేవ స్ఫూర్తితో శ్రమదానం, నివాళులు అర్పించారు.

MD AHMAD PASHA, JANGAON
Published on: 2 Oct 2026 1:35 PM IST
Jangaon
X

Jangaon: జనగామ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు!

Jangaon: జనగాం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మహాత్మా గాంధీజీ దేశానికి అందించిన సేవలను సత్యం, అహింస, స్వచ్ఛత వంటి ఆయన ఆశయాలను స్మరించుకున్నారు గాంధీజీ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడుస్తూ సమాజ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు అలాగే స్వచ్ఛతే సేవ అనే స్ఫూర్తితో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా మున్సిపల్ సిబ్బందికి సహకరించడం ద్వారా స్వచ్ఛ జనగాం నిర్మాణానికి ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో గౌరవ చైర్పర్సన్ మున్సిపల్ కమిషనర్ కౌన్సిలర్లు వార్డు అధికారులు మున్సిపల్ సిబ్బంది మరియు ప్రజలు పాల్గొని మహాత్మా గాంధీజీకి ఘన నివాళులు అర్పించారు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON