Mulugu: ములుగు జిల్లా ఆసుపత్రిలో వయోవృద్ధులకు ఉచిత కంటి వైద్య శిబిరం!

Mulugu: ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వయోవృద్ధులకు ఉచిత కంటి వైద్య శిబిరం. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా ఘనంగా నిర్వహణ.

PONNALA SWAMY, MULUGU
Published on: 26 Sept 2026 2:57 PM IST
Mulugu
X

Mulugu: ములుగు జిల్లా ఆసుపత్రిలో వయోవృద్ధులకు ఉచిత కంటి వైద్య శిబిరం!

Mulugu: అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం (International Day of Older Persons) సందర్భంగా అక్టోబర్ 01వ తేదీని పురస్కరించుకొని నిర్వహిస్తున్న వయోవృద్ధుల వారోత్సవ కార్యక్రమాలలో భాగంగా, జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లా సంక్షేమ అధికారి, స్త్రీ, శిశు, దివ్యాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వయోవృద్ధులకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీ .చంద్ర శేకర్ గారి ప్రత్యేక ఏర్పాట్లతో వయోవృద్ధులకు కంటి పరీక్షలు నిర్వహించడంతో పాటు, కంటి సంబంధిత సమస్యలు ఉన్న వారికి అవసరమైన వైద్య సలహాలు అందించారు. అవసరమైన వయోవృద్ధులకు ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది.

ఈ ఉచిత కంటి వైద్య శిబిరం ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకు నిర్వహించబడగా, సుమారు 40 మంది వయోవృద్ధులు శిబిరంలో పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు.

వయోవృద్ధుల ఆరోగ్యం, సంక్షేమం మరియు వారి పట్ల సామాజిక బాధ్యతను పెంపొందించేందుకు ఇలాంటి ఆరోగ్య కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని జిల్లా సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి శ్రీమతి ఇ.పి. ప్రేమలత, కార్యాలయ సిబ్బంది శ్రీ నాగేంద్ర, శ్రీ గణేష్, ప్రణామ్ డే కేర్ సెంటర్ సూపరింటెండెంట్ శ్రీ చుంచు రమేష్, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వైద్యులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

PONNALA SWAMY, MULUGU

PONNALA SWAMY, MULUGU