Parkal: పరకాలలో ఘనంగా ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం
Parkal: పరకాల సరస్వతీ శిశు మందిర్లో ఆర్ఎస్ఎస్ శివాజీ శాఖ ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
Parkal: పరకాలలో ఘనంగా ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం
పరకాల: దేశ సర్వాంగీణ అభివృద్ధే సంఘ్ లక్ష్యమని, ఈ లక్ష్యం కోసం సంఘం 100 ఏళ్లుగా కృషి చేస్తోందని ఆర్ఎస్ఎస్ పరకాల ఖండ్ సంఘచాలక్, కార్యవాహలు సాదు సర్వేశం, కొడకండ్ల శ్రీకాంత్ తెలిపారు. పరకాలలోని శివాజీ శాఖ ఆధ్వర్యంలో స్థానిక సరస్వతీ శిశు మందిర్ పాఠశాలలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.
పరకాల పట్టణంలోని రాధిక ఆయుర్వేద వైద్యశాల వైద్యులు డా. రాకేష్ ఆధ్వర్యంలో వచ్చిన వారికి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ప్రపంచానికి భారత్ అందించిన గొప్ప వరం ఆయుర్వేదమని, దేశ మూల వైద్యమైన ఆయుర్వేదాన్ని అందరూ ఆదరించాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డా. విద్యాసాగర్, సంఘ స్వయంసేవకులు చంద్రమోహన్, రఘునందన్, రాకేష్, గురు ప్రసాద్, రామన్న, రాజభద్రయ్య తదితరులు, 30 మంది స్వయంసేవకులు పాల్గొన్నారు.




