Narayanapet: కృష్ణ బ్రిడ్జి సమీప కనకదుర్గమ్మ ఆలయంలో భక్తిశ్రద్ధలతో పూజలు!

Narayanapet: నారాయణపేట జిల్లా మఖ్తల్ మండలం కృష్ణ బ్రిడ్జి సమీపంలోని కనకదుర్గమ్మ ఆలయంలో నవరాత్రి పూజలు. పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు.

B. NARENDER, MAKTHAL
Published on: 16 Oct 2026 3:21 PM IST
Narayanapet
X

Narayanapet: కృష్ణ బ్రిడ్జి సమీప కనకదుర్గమ్మ ఆలయంలో భక్తిశ్రద్ధలతో పూజలు!

Narayanapet: నారాయణపేట జిల్లా మఖ్తల్ నియోజకవర్గం కృష్ణ మండలం తెలంగాణ–కర్ణాటక సరిహద్దుల్లో కృష్ణ బ్రిడ్జి సమీపంలో వెలసిన కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు శివరాజ్ పాటిల్ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ పూజా కార్యక్రమానికి మఖ్తల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు,యువ నాయకులు,భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.

B. NARENDER, MAKTHAL

B. NARENDER, MAKTHAL