Mahabubabad: లింగ్యాతండా బాధిత కుటుంబాన్ని పరామర్శించిన సత్యవతి రాథోడ్!
Mahabubabad: లింగ్యాతండాలో తల్లి, ఇద్దరు పిల్లలు మృతి చెందిన ఘటనపై మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ జీజీహెచ్‌లో నివాళులర్పించి, బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
Mahabubabad: లింగ్యాతండా బాధిత కుటుంబాన్ని పరామర్శించిన సత్యవతి రాథోడ్!
మహబూబాబాద్, అక్టోబర్ 11: మహబూబాబాద్ జిల్లా కురవి మండలం లింగ్యాతండా (బలపాల) గ్రామంలో చోటుచేసుకున్న విషాద ఘటనలో బాణోత్ అనూషతో పాటు ఆమె ఇద్దరు పిల్లలు విశాల్ కృష్ణ, వర్షిణి మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది.
ఈ నేపథ్యంలో ఆదివారం మహబూబాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లో వారి భౌతికకాయాలకు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ మాజీ జడ్పీ చైర్‌పర్సన్ కుమారి బిందు ఆంగోత్, కురవి బీఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు తోట లాలయ్య, రాష్ట్ర యువజన నాయకుడు గుగులోత్ రవి నాయక్, బోడ శ్రీను నాయక్ తదితరులు పాల్గొన్నారు.




