Bhupalpally: ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మెకు మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు సంఘీభావం!

Bhupalpally: జయశంకర్ భూపాలపల్లిలో 25 రోజులుగా దీక్ష చేస్తున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు సంఘీభావం. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు.

Bhoomi Reddy, Bhupalpally
Published on: 6 Nov 2026 4:47 PM IST
Bhupalpally
X

Bhupalpally: ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మెకు మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు సంఘీభావం!

Bhupalpally: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల సమస్యలు పరిష్కారమవుతాయని ఆశిస్తే, ఇందిరమ్మ పాలనలో ఇంటింటా కన్నీళ్లే కనిపిస్తున్నాయని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ విమర్శించారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గత 25 రోజులుగా దీక్ష చేస్తున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల దీక్షా శిబిరాన్ని సందర్శించి ఆయన సంఘీభావం తెలిపారు.ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ మండిపడ్డారుఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం దీక్షలు చేస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

Bhoomi Reddy, Bhupalpally

Bhoomi Reddy, Bhupalpally