Warangal: కేయూ మాజీ వీసీ ప్రొఫెసర్ కోకటే కన్నుమూత!

Warangal: కాకతీయ వర్సిటీ మాజీ ఉపకులపతి ప్రొఫెసర్ చంద్రకాంత్ కోకటే పుణేలో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల కేయూ వీసీ ప్రతాప్ రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రం తీవ్ర సంతాపం తెలిపారు.

Narender, Staff Reporter  -Warangal
Published on: 3 Nov 2026 5:02 PM IST
Warangal
X

Warangal: కేయూ మాజీ వీసీ ప్రొఫెసర్ కోకటే కన్నుమూత!

వరంగల్: కాకతీయ విశ్వవిద్యాలయ మాజీ ఉపకులపతి, ప్రొఫెసర్ చంద్రకాంత్ కోకటే మృతి పట్ల విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కె. ప్రతాప్ రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి. రామచారం తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ చంద్రకాంత్ కోకటే మంగళవారం రాత్రి 9 గంటలకు మహారాష్ట్రలోని పుణేలో తుదిశ్వాస విడిచారు.

ఆయన 2001 నుంచి 2004 వరకు కాకతీయ విశ్వవిద్యాలయ ఉపకులపతిగా సేవలందించారు. అంతేకాకుండా, విశ్వవిద్యాలయంలో పలు కీలక పదవులను నిర్వహించి విద్యా, పరిశోధన రంగాల అభివృద్ధికి విశేష కృషి చేశారు. ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా కూడా ఆయన సేవలందించారు.

ప్రొఫెసర్ చంద్రకాంత్ కోకటే మరణం విద్యా, పరిశోధన రంగాలకు తీరని లోటని వీసీ ఆచార్య కె. ప్రతాప్ రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి. RAMCHANDRAM పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.