Parkal: పరకాల బాణాసంచా దుకాణాల వద్ద భద్రత గల్లంతు
Parkal: పరకాల జూనియర్ కళాశాల గ్రౌండ్‌లోని బాణాసంచా దుకాణాల వద్ద ఫైర్ ఇంజన్, నీరు, ఇసుక లేకపోవడంతో భద్రత గల్లంతైంది. తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని ప్రజల డిమాండ్.
Parkal: పరకాల బాణాసంచా దుకాణాల వద్ద భద్రత గల్లంతు
పరకాల: పరకాల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బాణాసంచా దుకాణాల వద్ద భద్రతా ప్రమాణాలు పూర్తిగా గాలికి వదిలేశారు.
నిబంధనల ప్రకారం ప్రతి బాణాసంచా దుకాణాల సముదాయం వద్ద తప్పనిసరిగా ఫైర్ ఇంజన్ అందుబాటులో ఉండాలి, ప్రతి దుకాణం ముందు ఇసుక, నీటి డ్రమ్ములు సిద్ధంగా ఉంచాలి. కానీ ఇక్కడ పరిస్థితి దారుణంగా ఉంది. ఫైర్ ఇంజన్ అసలు లేదు, ఉన్న డ్రమ్ముల్లో నీరు లేదు, ఇసుక లేదు. ఇది అధికారుల పర్యవేక్షణ లోపానికి నిదర్శనం.
దీపావళి పండుగ నేపథ్యంలో రోజూ వందలాది మంది ప్రజలు, మహిళలు, చిన్న పిల్లలు ఈ దుకాణాల వద్దకు వస్తున్నారు. ఇలాంటి సమయంలో చిన్న అగ్ని ప్రమాదం జరిగినా పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం జరిగే ప్రమాదం ఉంది. కేవలం లైసెన్సులు ఇచ్చి వదిలేయడం కాదు, ప్రజల ప్రాణాలకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏదైనా జరగరానిది జరిగితే దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఫైర్ ఇంజన్‌ను ఏర్పాటు చేసి, అన్ని భద్రతా చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.




