Garla: దోపిడీ రహిత సమాజ నిర్మాణం కోసం పోరాడుదాం: న్యూ డెమోక్రసీ
Garla: మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో తునికాకు అమరవీరుల సంస్మరణ సభలు నిర్వహించి, దోపిడీ రహిత సమాజం కోసం పోరాడాలని న్యూ డెమోక్రసీ నేతలు పిలుపునిచ్చారు.
Garla: దోపిడీ రహిత సమాజ నిర్మాణం కోసం పోరాడుదాం: న్యూ డెమోక్రసీ
మహబూబాబాద్ జిల్లా: గార్ల మండలంలోని గోపాలపురం గ్రామంలో సిపిఎం ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు జడ సత్యనారాయణ, సక్రు ఆధ్వర్యంలో తునికాకు అమరవీరుల పిన్ని రెడ్డిగూడెం గ్రామాలలో కేలోతు బద్రు, బాలాజీ తండా గ్రామంలో బట్టు బాలు, స్థూపాలపై జెండాలు ఎగరవేయడం జరిగింది.
అనంతరం సంస్కరణ సభలను ఉద్దేశించి జడ సత్యనారాయణ, సక్రు లు మాట్లాడుతూ నేటికీ దేశంలో భూమి సమస్య నిరుద్యోగం పేదరికం శ్రమదోపిడి సామాజిక అసమానతలు కొనసాగుతూ ఉండడం పాలకుల వైఫల్యానికి నిదర్శనం అని వారు విమర్శించారు.
అమరవీరుల త్యాగాలను కేవలం సంస్కరణ సభలో నినాదాలకే పరిమితం కాకుండా వారు ఆశించిన దోపిడి రహిత సమాజ నిర్మాణం కోసం ప్రజలను చైతన్యపరిచి రైతులు వ్యవసాయ కార్మికులు పేద ప్రజలను ఐక్యం చేసి ప్రజా పోరాటాలను బలోపేతం చేయాలని వారు అన్నారు, విప్లవోద్యమం ప్రజల జీవిత సమస్యలతో మమేకమైనప్పుడే ఆశయాలకు నిజమైన అర్థం ఉంటుందని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు మట్టపల్లి వీరభద్రం, సిహెచ్ గణేష్, ఈ రవి, బజారు, భద్రాజి, ఉపేందర్, జి మాధవరావు, కొండయ్య, పెంటయ్య, గురువయ్య, భద్రయ్య, రామకృష్ణ చారి, కొండలరావు, తదితరులు పాల్గొన్నారు.




