Parkal: గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్వాసిత రైతులు ఎంపీ ఈటల రాజేందర్‌ను భేటీ!

Parkal: గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్వాసిత రైతులు హైదరాబాద్‌లో ఎంపీ ఈటల రాజేందర్‌ను కలిసి వినతి. మార్కెట్ ధర ప్రకారం పరిహారం ఇప్పించాలని డిమాండ్.

M PRABHAKAR, PARAKAL
Published on: 11 Oct 2026 6:01 PM IST
Parkal
X

Parkal: గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్వాసిత రైతులు ఎంపీ ఈటల రాజేందర్‌ను భేటీ!

Parkal: పరకాల, శాయంపేట, దామెర మండలాలకు చెందిన గ్రీన్‌ఫీల్డ్ హైవే బాధిత రైతులు ఆదివారం హైదరాబాద్‌లో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ను కలిశారు.

బహిరంగ మార్కెట్ ధరలతో పోలిస్తే ప్రభుత్వం ఇస్తున్న నష్టపరిహారం 10 శాతం కూడా లేదని, తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని రైతులు విన్నవించారు.

దీనిపై స్పందించిన ఎంపీ ఈటల సంబంధిత కేంద్ర మంత్రులు, జిల్లా కలెక్టర్లతో ఫోన్‌లో మాట్లాడి మార్కెట్ ధర ప్రకారం పరిహారం చెల్లించాలని కోరినట్లు రైతులు తెలిపారు. బాధితులకు న్యాయం చేస్తామని కేంద్ర మంత్రులు హామీ ఇచ్చారన్నారు.

ఈ కార్యక్రమంలో బూర్గుల రామచంద్రరావు, నల్లల సతీష్, పెళ్లి జనార్దన్, గోనె రాజిరెడ్డి, టైల్ సాంబయ్య, అబ్బాడి రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

M PRABHAKAR, PARAKAL

M PRABHAKAR, PARAKAL