Dornakal: డోర్నకల్‌లో వ్యవసాయ మోటార్ చోరీకి యత్నం, ఇద్దరి పట్టివేత!
Dornakal: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం బూర్గుపహాడ్‌లో వ్యవసాయ బావి వద్ద మోటార్ చోరీకి యత్నించిన ఇద్దరిని పట్టుకుని పోలీసులకు అప్పగించిన రైతులు.
Dornakal: డోర్నకల్‌లో వ్యవసాయ మోటార్ చోరీకి యత్నం, ఇద్దరి పట్టివేత!
Dornakal: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం బూర్గుపహాడ్ గ్రామంలో వ్యవసాయ బావి వద్ద మోటార్ చోరీకి యత్నించిన ఇద్దరిని రైతులు పట్టుకుని పోలీసులకు అప్పగించిన ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది.
బూర్గుపహాడ్ గ్రామానికి చెందిన రైతు దబ్బా శ్రీనుకు బూర్గుపహాడ్ నుంచి ఎన్నారం వెళ్లే మార్గంలో 1 ఎకరం 14 కుంటల వ్యవసాయ భూమి ఉంది. ఆ భూమిలోని బావికి 3 హెచ్‌పీ మోటార్ ఏర్పాటు చేశారు. సోమవారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో చిలుకోడు గ్రామానికి చెందిన మోటార్ మెకానిక్ బంక నగేష్, ప్రసాద్ కలిసి బావి నుంచి మోటార్‌ను బయటకు తీసేందుకు ప్రయత్నించినట్లు రైతు తెలిపారు.
అదే సమయంలో రైతు పొలం వద్దకు వెళ్లడంతో ఇద్దరినీ పట్టుకున్నట్లు పేర్కొన్నారు. వెంటనే డోర్నకల్ పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరినీ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
గతంలోనూ బూర్గుపహాడ్ పరిసర ప్రాంతాల్లో వ్యవసాయ మోటార్ల చోరీ ఘటనలు జరిగినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోటార్లు కాలిపోయినప్పుడు మరమ్మతులు చేసే మెకానిక్‌లకు పొలాల్లో మోటార్లు ఎక్కడ ఉన్నాయో తెలిసే అవకాశం ఉండటంతో, కొందరు మెకానిక్‌లు చోరీలకు పాల్పడుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వ్యవసాయ మోటార్ల చోరీలను అరికట్టేందుకు పోలీసులు రాత్రి వేళల్లో గస్తీ పెంచాలని రైతులు కోరుతున్నారు.




