Mahabubabad: బయ్యారంలో పెద్ద చెరువు నీటి విడుదల కోరుతూ రైతుల ధర్నా!
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో బయ్యారం పెద్ద చెరువు నీటిని విడుదల చేయాలని కోరుతూ జాతీయ రహదారిని దిగ్బంధించిన రైతులు. ఎండిపోతున్న పంటలపై ఆందోళన.
Mahabubabad: బయ్యారంలో పెద్ద చెరువు నీటి విడుదల కోరుతూ రైతుల ధర్నా!
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని బయ్యారం పెద్ద చెరువు నీళ్లను పంట పొలాలకు విడుదల చేయక పోవడం పట్ల ఆయకట్టు రైతులు కన్నెర్ర చేశారు, వేసిన పంటలు నిలువున ఎండిపోతుండటం తో కడుపు మండిన రైతులు 930 జాతీయ రహదారి ని దిగ్బంధం చేశారు,గత పది రోజులు గా చెరువు అలుగు పోస్తూ నీరు వృధాగా పోతున్న అధికారులు, ప్రజాప్రతినిధులు నిమ్మకు నీరే తిన్నట్లు వ్యవహారిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటికి ఎకరాకు 25-30 వేల పెట్టుబడి పెట్టి ఉన్నామని నీరు విడుదల చేయడం లో వచ్చిన ఇబ్బంది ఏమిటని ప్రశ్న..పంటలు నిలువున ఎండుతున్న ప్రభుత్వానికి దున్నపోతు మీద వాన కురిసిన చందంగా వ్యవహారిస్తుందని ఆగ్రహం.
చెరువు అభివృద్ధి కి పైసా ఖర్చు పెట్టని ప్రభుత్వానికి చెరువు నీళ్లు విడుదల చేయకుండా ఆపే హక్కు ఎక్కడిదని ప్రశ్న ప్రభుత్వం తక్షణమే సానుకూలంగా స్పందించి నీటిని విడుదల చేయకపోతే రైతులమే చెరువు తూములు లేపి నీటిని వదులుతామని హెచ్చరిక,స్థానిక అధికారులు రైతులకు నచ్చచేప్పే ప్రయత్నం చేయగా,రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు, సమస్య ను ఉన్నాతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి నీటివిడుదలకు సహకరిస్తామని హామీ ఇచ్చిన అధికారులు రైతుల ధర్నా తో హైవే పై భారీగా నిలిచినా వాహనాలు.




