Gudur: గూడూరు మండలంలో రైతు రిజిస్ట్రేషన్ (ఫార్మర్ ఐడీ) కార్యక్రమం ప్రారంభం!

Gudur: గూడూరు మండలంలో 'అగ్రిస్టాక్' కార్యక్రమంలో భాగంగా రైతు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం. సెప్టెంబర్ 30 వరకు గ్రామాల వారీగా ప్రత్యేక నమోదు.

B NARASIMHA, GUDUR
Published on: 22 Sept 2026 5:23 PM IST
Gudur
X

Gudur: గూడూరు మండలంలో రైతు రిజిస్ట్రేషన్ (ఫార్మర్ ఐడీ) కార్యక్రమం ప్రారంభం!

Gudur: రైతులకు ప్రభుత్వ వ్యవసాయ పథకాలు, సేవలను మరింత పారదర్శకంగా, సులభంగా అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 'అగ్రిస్టాక్' కార్యక్రమంలో భాగంగా గుడూరు మండలంలో రైతు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. సెప్టెంబర్ 22 నుండి 30వ తేదీ వరకు గ్రామాల వారీగా ఈ ప్రత్యేక నమోదు కార్యక్రమం నిర్వహించనున్నట్లు మండల వ్యవసాయ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.

"ఒక రైతు – ఒక గుర్తింపు – సమగ్ర సేవలు" అనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

రైతు రిజిస్ట్రేషన్‌తో కలిగే ముఖ్య ప్రయోజనాలు

వరి, పత్తి, మొక్కజొన్న తదితర పంటల వివరాలను సులభంగా నమోదు చేసుకోవచ్చు.

ఎరువుల కొనుగోలు: ఎఫ్.ఎఫ్.ఎస్ (FFS - Framework for Fertilizer Sales App) ద్వారా ఎరువులను సులభంగా పొందే వీలుంటుంది.

పంట రుణాలు: బ్యాంకుల నుండి ఎలాంటి ఆలస్యం లేకుండా పంట రుణాలను వేగంగా పొందవచ్చు.

ప్రభుత్వ పథకాలు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సబ్సిడీలు, సంక్షేమ పథకాలు నేరుగా అర్హులకు అందుతాయి.

రిజిస్ట్రేషన్‌కు కావాల్సిన పత్రాలు

రైతులు తమ సమీప గ్రామంలో జరిగే నమోదు కేంద్రానికి ఆధార్ కార్డు, భూమి పట్టాదారు పాస్‌బుక్ మరియు మొబైల్ ఫోన్ (ఓటీపీ కోసం)తో హాజరై వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.

'ఫార్మర్ ఐడీ' అత్యంత కీలకం:

నమోదు ప్రక్రియ పూర్తయిన వెంటనే ప్రతి రైతుకు ఒక విశిష్ట 'ఫార్మర్ ఐడీ నంబర్' (Farmer ID) కేటాయించబడుతుంది. భవిష్యత్తులో వ్యవసాయ శాఖ ద్వారా అందే సేవలు, రాయితీలు, పరిపరిశోధనాత్మక లబ్ధి పొందేందుకు ఈ ఐడీ ప్రామాణికంగా పనిచేస్తుందని వ్యవసాయ అధికారి తెలిపారు.

కావున, గూడూరు మండలంలోని రైతులందరూ సెప్టెంబర్ 30వ తేదీలోపు తమ గ్రామంలో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని, తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని మండల వ్యవసాయ శాఖ అధికారి అబ్దుల్ మాలిక్ కోరారు.

B NARASIMHA, GUDUR

B NARASIMHA, GUDUR