Jangaon: ఎస్ఎస్కే హాస్పిటల్ వైద్య నిర్లక్ష్యంతో వ్యక్తి మృతి.. బంధువుల ఆందోళన!
Jangaon: జనగామలోని ఎస్ఎస్కే ప్రైవేట్ హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఎర్రగుళ్లపాడుకు చెందిన వజ్జ రాజు మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు.
Jangaon: ఎస్ఎస్కే హాస్పిటల్ వైద్య నిర్లక్ష్యంతో వ్యక్తి మృతి.. బంధువుల ఆందోళన!
Jangaon: జనగామ లోని ఎస్ ఎస్ కే ప్రవేట్ హాస్పిటల్ లో వైద్యుని నిర్లక్ష్యం వల్ల వ్యక్తి మృతి చెందాడని కుటుంబ సభ్యుల ఆరోపణ. మృతుడు జనగామ మండలం ఎర్రగుళ్లపాడు గ్రామానికి చెందిన వజ్జ రాజు.
వజ్జ రాజు మృతికి ఎస్ఎస్కే హాస్పిటల్ వైద్య నిర్లక్ష్యం వల్లనే చనిపోయాడంటూ మృతిని కుటుంబ సభ్యుల హాస్పిటల్ ముందు ఆందోళన చేపట్టారు. నిన్న ఉదయం చాతిలో నొప్పి ఉండడంతో ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ చేరగా వైద్యులు పరీక్షించి గుండె సమస్య ఉన్నట్టు నిర్ధారించి మెరుగైన వైద్యం కోసం వేరే హాస్పటల్ వెళ్లాలని చెప్పారు.
వెంటనే జనగామలోని ఎస్ ఎస్ కే ప్రైవేట్ హాస్పటల్లో జాయిన్ చేశారు. అన్ని వైద్య పరీక్షలు నిర్వహించి ఇప్పుడు బాగానే ఉన్నాడని చెప్పి ఇంటికి పంపారు.
ఈరోజు మళ్లీ ఉదయం అదే నొప్పి రావడంతో ఎస్ ఎస్ కే హాస్పిటల్ కు రాగ ఇప్పుడు డాక్టర్ లేరని సిబ్బంది చెప్పడంతో మళ్లీ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయాడని చెప్పిన వైద్యులు నిన్ననే తనకి ప్రాబ్లం ఉందని చెప్తే మేము వేరే హాస్పిటల్ కి తీసుకెళ్లే వాళ్ళం అలా చెప్పకుండా ఇంటికి తీసుకెళ్ళమని చెప్పారు.
అన్ని టెస్టులు చేసిన తర్వాత సమస్యను లేదంటేనే ఇంటికి తీసుకెళ్లాం తీరా చూస్తే ఇప్పుడు చనిపోయాడు. దీనికి పూర్తి బాధ్యత వైద్యుడు నిర్లక్ష్యం వల్లనే జరిగిందని ఆరోపిస్తున్న కుటుంబ సభ్యులు. మృతుడికి భార్య ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు.




