Parkal: వెలవెలబోయిన బతుకమ్మ వేడుకలు

Parkal: పరకాలలో బతుకమ్మ వేడుకల ఏర్పాట్లలో మున్సిపల్ అధికారులు విఫలమయ్యారు. డీజే సౌండ్ ఫెయిల్ కావడంతో ఆడబిడ్డలు తీవ్ర నిరాశకు గురయ్యారు.

M PRABHAKAR, PARAKAL
Published on: 10 Oct 2026 10:11 PM IST
Parkal
X

Parkal: వెలవెలబోయిన బతుకమ్మ వేడుకలు

పరకాల: తెలంగాణ ఆడబిడ్డలు అత్యంత సంబురంగా జరుపుకునే బతుకమ్మ వేడుకల ఏర్పాట్లలో పరకాల మున్సిపల్ అధికారులు ఘోరంగా విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పశువుల సంత మైదానంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకల్లో ఆటపాటల కోసం పెట్టిన DJ సౌండ్ సిస్టం పూర్తిగా ఫెయిల్ కావడంతో మహిళలు తీవ్ర నిరాశకు గురయ్యారు. సౌండ్ సరిగా రాకపోవడంతో బతుకమ్మ చుట్టూ ఆటలు, పాటలు పాడలేక ఇబ్బంది పడ్డారు.

పండుగ కోసం ఉత్సాహంగా వచ్చిన తమకు అధికారుల అట్టర్ ఫ్లాప్ ఏర్పాట్లతో నిరాశే మిగిలిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏటా లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెబుతున్నా కనీస సౌండ్ సిస్టం కూడా సరిగా ఏర్పాటు చేయలేకపోవడం మున్సిపల్ వైఫల్యానికి నిదర్శనమని స్థానికులు మండిపడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ఇకనైనా సరైన ఏర్పాట్లు చేయాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు.

M PRABHAKAR, PARAKAL

M PRABHAKAR, PARAKAL