Mulugu: వి.బి.జి. రామ్ జి పనుల్లో వేగం పెంచాలి: జిల్లా కలెక్టర్

Mulugu: వి.బి.జి. రామ్ జి పనులను వేగవంతం చేసి, నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు ఆదేశించారు.

Narender, Staff Reporter  -Warangal
Published on: 12 Nov 2026 4:24 PM IST
Mulugu
X

Mulugu: వి.బి.జి. రామ్ జి పనుల్లో వేగం పెంచాలి: జిల్లా కలెక్టర్

Mulugu: వి.బి.జి. రామ్ జి పథకం కింద చేపట్టిన పనులను వేగవంతం చేసి, నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు సంబంధిత అధికారులను ఆదేశించారు.

గురువారం జిల్లా సమీకృత కలెక్టరేట్‌ లోని మినీ సమావేశం హాల్ లో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఎం. సంపత్ రావుతో కలిసి జిల్లాలోని అన్ని మండలాల ఎంపీడీఓలతో వి.బి.జి. రామ్ జి పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మండలాల వారీగా ఉపాధి హామీ పనుల పురోగతి, ఇంకుడు గుంతలు, బోరుబావుల రీఛార్జ్ పాయింట్లు, ఊట చెరువులు, పంట కుంటల నిర్మాణం తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపునకు దోహదపడే పనులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఇంకుడు గుంతలు, బోరుబావుల రీఛార్జ్ నిర్మాణాలు, ఊట చెరువులు, పంట కుంటల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.

మండలాల వారీగా నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పనులు చేపట్టాలని, ప్రతి ఎంపీడీఓ తమ పరిధిలోని గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. పనుల అమలులో జాప్యానికి తావులేకుండా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.

ఉపాధి హామీ పనుల అమలులో అధికారులు ఎలాంటి అలసత్వం, నిర్లక్ష్యం వహించకుండా ప్రత్యేక దృష్టి సారించి, నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

ఈ సమావేశంలో జిల్లాలోని అన్ని మండలాల ఎంపీడీఓలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.