Hanumakonda: బీమా ఆన్‌లైన్ నమోదు త్వరగా పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్!

Hanumakonda: ఆత్మకూర్ మండలం తిరుమలగిరిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను శుక్రవారం హనుమకొండ అదనపు కలెక్టర్ ఎన్. రవి పరిశీలించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 20 Nov 2026 4:57 PM IST
Hanumakonda
X

Hanumakonda: బీమా ఆన్‌లైన్ నమోదు త్వరగా పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్!

హనుమకొండ జిల్లా: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ఆన్లైన్ నమోదు ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి అన్నారు.

శుక్రవారం హనుమకొండ జిల్లా ఆత్మకూర్ మండలం తిరుమలగిరి గ్రామంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ఆన్లైన్ నమోదు ప్రక్రియ చేస్తుండగా జిల్లా అదనపు కలెక్టర్ సందర్శించారు. గ్రామస్తుల వివరాలను ఆన్లైన్ విధానంలో బీమా కోసం నమోదు చేస్తుండగా పరిశీలించారు.ఆన్లైన్ నమోదు ప్రక్రియకు సంబంధించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ రవి మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ప్రయోజనం కలుగుతుందన్నారు. బీమా నమోదు ప్రక్రియను గ్రామంలో వంద శాతం పూర్తి చేయాలన్నారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బూర దేవేంద్ర రాజేందర్ , తహసీల్దార్ జగన్మోహన్ రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్