Guduru: గూడూరులో మాజీ ఎంపీ కవితా మాలోత్ పరామర్శ - ఘన నివాళి!
Guduru: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బొద్దుగొండలో ముక్క లక్ష్మణరావు తల్లి దశదిన కర్మకు హాజరైన మాజీ ఎంపీ కవితా మాలోత్. చిత్రపటానికి నివాళి.
Guduru: గూడూరులో మాజీ ఎంపీ కవితా మాలోత్ పరామర్శ - ఘన నివాళి!
Guduru: మహబూబాబాద్ జిల్లా, గూడూరు మండలం, బొద్దుగొండ గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు ముక్క లక్ష్మణరావు గారి తల్లిగారు ఇటీవల మృతి చెందిన విషయం విదితమే. సోమవారం రోజున నిర్వహించిన ఆమె దశదిన కర్మ కార్యక్రమానికి మహబూబాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యురాలు కవిత మాలోత్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా లక్ష్మణరావు గారి నివాసానికి చేరుకున్న కవిత మాలోత్, దివంగత లక్ష్మణరావు గారి తల్లిగారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ గాఢ సానుభూతిని తెలిపారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ కష్టసమయంలో ఆ కుటుంబానికి ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సుధాకర్ రావు, జిల్లే యాకయ్య, ముత్యం వెంకన్న గౌడ్, మహబూబ్ పాషా, నల్లని నవీన్ రావు, పొన్నాల యుగేందర్, బానోత్ రాము నాయక్ తదితరులు పాల్గొని నివాళులర్పించారు.




