Damera: నివాళులు అర్పించిన పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
Damera: హనుమకొండ జిల్లా దామెర మండలంలో మృతిచెందిన పలువురి పార్థివదేహాలకు పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Damera: నివాళులు అర్పించిన పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
హనుమకొండ జిల్లా: దామెర మండల రిపోర్టర్ మన్నెం ఇంద్రారెడ్డి తల్లి సరోజన, దామెర గ్రామానికి చెందిన దుర్గణాల నరసింహారావు, సింగరాజుపల్లి గ్రామ బీఆర్‌ఎస్ నాయకులు, ఉపసర్పంచ్ ఉప్పుల శ్రీను తండ్రి రామిరెడ్డి (రాములు) మృతిచెందారు. విషయం తెలుసుకున్న పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వారి పార్థీవదేహాలను సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం మృతుల కుటుంబసభ్యులను పరామర్శించి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు బీఆర్‌ఎస్ పార్టీ, తాను ఎల్లప్పుడూ అండగా ఉంటామని చల్లా ధర్మారెడ్డి భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమం లో బ్రష్ పార్టీ దామెర మండల అధ్యక్షులు గండు రామకృష్ణ (రాము ) సమన్వయ కమిటీ సభ్యులు పోలేం కృపాకర్ రెడ్డి దామెరుప్పుల శంకర్ పున్నం సంపత్ గరిగే కృష్ణమూర్తి ఒగ్లపూర్ సర్పంచ్ కేతిపెల్లి శ్రీధర్ రెడ్డి సింగరాజుపల్లి సర్పంచ్ వడ్డేపల్లి చందు దమ్మన్నపేట సర్పంచ్ దుబాసి నవీన్ మాజీ సర్పంచ్ లు పాండవుల బిక్షపతి ఉప్పుల సత్యం BRS పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు కిన్నెరా రమేష్ బత్తిని రాజు ఉప్పుల శివ మండల నాయకులు కన్నెబోయిన రమేష్ పుల్యాల రఘుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




