Parkal: పరకాలలో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు!

Parkal: వరంగల్ జిల్లా పరకాలలో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గునుగు, తంగేడు పూలతో బతుకమ్మలను పేర్చి మహిళలు భక్తిశ్రద్ధలతో గౌరమ్మను పూజించారు.

M PRABHAKAR, PARAKAL
Published on: 10 Oct 2026 11:48 AM IST
Parkal
X

Parkal: పరకాలలో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు!

Parkal: తెలంగాణ సంస్కృతికి, ఆడపడుచుల ఆత్మగౌరవానికి, ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలు పరకాలలో ఘనంగా ప్రారంభమయ్యాయి. నేడు ఎంగిలిపూల బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలు ఔషధ గుణాలున్న తంగేడు, గునుగు, బంతి వంటి రకరకాల పూలతో బతుకమ్మను పేర్చి గౌరమ్మను కొలిచారు.

బతుకమ్మ అంటే 'బతుకునిచ్చే తల్లి' అని అర్థమని, వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండాలని, కుటుంబం సంతోషంగా ఉండాలని, యువతులు మంచి భర్త రావాలని కోరుతూ 9 రోజుల పాటు ఈ పూల పండుగను తెలంగాణ ఆడబిడ్డలు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారని మహిళలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

M PRABHAKAR, PARAKAL

M PRABHAKAR, PARAKAL