Mylaram: మైలారంలో ఘనంగా ప్రారంభమైన ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు

Mylaram: రాయపర్తి మండలం మైలారంలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి మహిళలు, చిన్నారులు సందడి చేశారు.

P ASHOK, WARDHANNAPET
Published on: 10 Oct 2026 10:20 PM IST
Mylaram
X

Mylaram: మైలారంలో ఘనంగా ప్రారంభమైన ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు

మైలారం: వరంగల్ జిల్లారాయపర్తి మండలం మైలారం గ్రామంలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల వేదికగా నిర్వహించిన తొలి ఎంగిలిపూల బతుకమ్మ పురోహితుడుచే కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ వేడుకల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. వివిధ రకాల రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సంప్రదాయ దుస్తుల్లో మహిళలు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. బతుకమ్మ పాటలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. మైలారం గ్రామంలో ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన సంబరాలు.. మహిళల సందడితో గ్రామమంతా పండుగ శోభను సంతరించుకుంది.

P ASHOK, WARDHANNAPET

P ASHOK, WARDHANNAPET