Warangal: విద్యుత్ పొదుపు, నీటి సంరక్షణ ప్రజా ఉద్యమం కావాలి: డీఈ రాజేందర్
Warangal: బ్రిక్స్ సస్టెయినబుల్ లైఫ్‌స్టైల్ వీక్ సందర్భంగా విద్యుత్ పొదుపు, నీటి సంరక్షణను ప్రజా ఉద్యమంగా మార్చాలని టీజీరెడ్కో డీఈ రాజేందర్ గంధం పిలుపునిచ్చారు.
Warangal: విద్యుత్ పొదుపు, నీటి సంరక్షణ ప్రజా ఉద్యమం కావాలి: డీఈ రాజేందర్
వరంగల్: BRICS Sustainable Lifestyle Week (నవంబర్ 1–7) సందర్భంగా మిషన్ LiFE (Lifestyle for Environment) లక్ష్యాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని DE/TGREDCO రాజేందర్ గంధం పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని, విద్యుత్ పొదుపు, నీటి సంరక్షణను నిత్యజీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు.
అవసరం లేనప్పుడు విద్యుత్ పరికరాలను ఆపివేయడం, సౌరశక్తిని వినియోగించడం, నీటిని వృథా చేయకుండా పొదుపుగా ఉపయోగించడం వంటి అలవాట్లను పాటించాలని కోరారు. కుటుంబ సభ్యులు, విద్యార్థులు, యువతతో పాటు అన్ని వర్గాల ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించాలని తెలిపారు.
“మనం ఆదా చేసే ప్రతి యూనిట్ విద్యుత్ దేశ సంపదకు తోడ్పడుతుంది. మనం పొదుపు చేసే ప్రతి నీటి బొట్టు భావితరాలకు భరోసానిస్తుంది” అని పేర్కొన్నారు.
ప్రభుత్వ శాఖలు, విద్యాసంస్థలు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలందరూ మిషన్ LiFEలో భాగస్వాములై విద్యుత్ పొదుపు, నీటి సంరక్షణను ప్రజా ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలని ఆయన విజ్ఞప్తి చేశారు.




