Bayyaram: గార్ల మండలంలో దుర్గామాత మండపాలను సందర్శించిన డీఎస్పీ!
Bayyaram: మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో దుర్గామాత మండపాలను సందర్శించిన డీఎస్పీ తిరుపతి రావు. నిమజ్జనాలు ప్రశాంతంగా జరుపుకోవాలని పోలీసుల సూచనలు.
Bayyaram: గార్ల మండలంలో దుర్గామాత మండపాలను సందర్శించిన డీఎస్పీ!
Bayyaram: గార్ల మండలంలోని సీతంపేట, గార్ల లో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాలను మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతి రావు, బయ్యారం సీఐ రవీందర్ సందర్శించారు.
ఈ సందర్భంగా మండప నిర్వాహకులకు తగు జాగ్రత్తల గురించి సూచించారు. డీజేలు గాని శాంతిభద్రతలకు భంగం కలగకుండా చూడాలని, ప్రశాంత వాతావరణంలో నిమజ్జనాలు పండుగ వాతావరణంలో చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గార్ల ఎస్ఐ సాయికుమార్, ఏఎస్ఐ వెంకటరెడ్డి, సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ శ్యామ్, కానిస్టేబుల్ శ్రీను, సిరాజ్ పాషా, సుధాకర్, రాం నరసయ్య, రాము, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.




