Rayaparthy: రాయపర్తి మైలారం రిజర్వాయర్‌లో గణేష్ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన!
Rayaparthy: రాయపర్తి మండలం మైలారం రిజర్వాయర్ వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా పంచాయతీ అధికారి కటకం కల్పన. పకడ్బందీ భద్రతకు అధికారుల ఆదేశం.
Rayaparthy: రాయపర్తి మైలారం రిజర్వాయర్‌లో గణేష్ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన!
Rayaparthy: రాయపర్తి మండలంలో గణనాథుని నిమజ్జనోత్సవాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) కటకం కల్పన అధికారులకు సూచించారు. నిమజ్జనం సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మైలారం రిజర్వాయర్ వద్ద గణేశ్ నిమజ్జనం కోసం చేపడుతున్న ఏర్పాట్లను ఆమె పరిశీలించారు.
నిమజ్జనానికి పెద్ద సంఖ్యలో భక్తులు, గణేష్ విగ్రహాలతో వచ్చే అవకాశం ఉన్నందున రద్దీని దృష్టిలో ఉంచుకుని అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. రిజర్వాయర్ పరిసరాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, నిమజ్జన ప్రాంతాన్ని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు.
భక్తుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా అవసరమైన ఏర్పాట్లు చేయడంతో పాటు నిమజ్జన ప్రాంతంలో భద్రతా చర్యలు పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. విగ్రహాలను నిమజ్జనం చేసే సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా సంబంధిత అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. అలాగే నిమజ్జనానికి వచ్చే భక్తులకు తాగునీరు తదితర మౌలిక వసతుల విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యే వరకు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీపీవో కల్పన సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి కూచన ప్రకాష్ పాల్గొన్నారు.




