Mahabubabad: డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్‌కు తప్పిన పెను ప్రమాదం!
Mahabubabad: డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ కారులో పవర్ బ్యాంక్ పేలి మంటలు చెలరేగాయి. ఎమ్మెల్యే సురక్షితంగా బయటపడగా, డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.
Mahabubabad: డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్‌కు తప్పిన పెను ప్రమాదం!
మహబూబాబాద్ జిల్లా, సెప్టెంబర్ 17: డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. మహబూబాబాద్‌లో నిర్వహించే విమోచన దినోత్సవ జెండా కార్యక్రమానికి వెళ్తుండగా చింతపల్లి గ్రామ పరిసరాల్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న వాహనంలోని పవర్ బ్యాంక్ పేలడంతో కారు క్యాబిన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే స్పందించడంతో ప్రమాదం మరింత తీవ్రం కాకుండా నివారించినట్లు తెలుస్తోంది.
ప్రమాదం అనంతరం ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ మరో వాహనంలో మహబూబాబాద్‌కు బయలుదేరారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




