Dornakal: నాటుసారా కేంద్రాలపై దాడులు ఇద్దరి అరెస్ట్, పానకం ధ్వంసం

Dornakal: డోర్నకల్ మండలంలో ఎక్సైజ్ దాడులు. ఇద్దరి అరెస్ట్, 11 లీటర్ల నాటుసారా స్వాధీనం. సారా తయారీకి సిద్ధంగా ఉన్న 600 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం.

P PRABHAKAR, DORNAKAL
Published on: 5 Nov 2026 9:48 PM IST
Dornakal
X

Dornakal: నాటుసారా కేంద్రాలపై దాడులు ఇద్దరి అరెస్ట్, పానకం ధ్వంసం

డోర్నకల్: డోర్నకల్ మండలంలోని మాన్యా తండా, చాంప్లా తండా, ధరావత్ తండాల్లో ఎక్సైజ్ అధికారులు నాటుసారా తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 11 లీటర్ల నాటుసారా, 100 కిలోల నల్లబెల్లం, 40 కిలోల పటికను స్వాధీనం చేసుకున్నారు.

సారా తయారీకి సిద్ధం చేసిన 600 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. నిందితులను ఎమ్మార్వో ఎదుట హాజరుపరిచి బైండోవర్ చేసినట్లు ఎక్సైజ్ సీఐ రాంప్రసాద్ తెలిపారు. నాటుసారా తయారీ, విక్రయాలు, రవాణాకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

P PRABHAKAR, DORNAKAL

P PRABHAKAR, DORNAKAL