Kesamudram: శ్రీ వివేకవర్ధిని స్కూల్‌లో ఘనంగా దీపావళి వేడుకలు
Kesamudram: కేసముద్రం శ్రీ వివేకవర్ధిని హైస్కూల్‌లో ముందస్తు దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు నరకాసుర వధను ప్రదర్శించి ఆకట్టుకున్నారు.
Kesamudram: శ్రీ వివేకవర్ధిని స్కూల్‌లో ఘనంగా దీపావళి వేడుకలు
మహబూబాబాద్ జిల్లా: నరకాసుర వధ.. శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణతో విద్యార్థుల సందడి కేసముద్రం మండల కేంద్రంలోని శ్రీ వివేకవర్ధిని హై స్కూల్ లో శనివారం ముందస్తు దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నరకాసుర వధ కార్యక్రమాన్ని చేపట్టారు. విద్యార్థులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో రాక్షసులతో యుద్ధం చేసే సన్నివేశాలను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పాఠశాల కరస్పాండెంట్ చిర్ర యాకాంతం గౌడ్ మాట్లాడుతూ దీపావళి పండుగ ప్రత్యేకత, ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని, ప్రతి ఒక్కరూ సంతోషంగా, ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ చిర్ర నరేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.




