Mahabubabad: కురవి వీరభద్రస్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమికి పోటెత్తిన భక్తులు!
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా కురవి శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు పోటెత్తారు.
Mahabubabad: కురవి వీరభద్రస్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమికి పోటెత్తిన భక్తులు!
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా, కురవి మండల కేంద్రంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారుజాము నుంచే అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా కే. సీతారాములు, పర్మిల దంపతులు శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కార్తీక పౌర్ణమి హిందువులకు అత్యంత పవిత్రమైన పర్వదినం. ఈ రోజున శివారాధన, దీపారాధన చేయడం వల్ల పుణ్యఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది.




