Gudur: మామునూరు ఎయిర్‌పోర్టుకు దొడ్డి కొమురయ్య పేరు పెట్టాలి!

Gudur: మహబూబాబాద్ జిల్లా గూడూరులో గొల్లకురుమ సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించి, మామునూరు ఎయిర్‌పోర్టుకు దొడ్డి కొమురయ్య పేరు పెట్టాలని డిమాండ్ చేశారు.

B NARASIMHA, GUDUR
Published on: 4 Oct 2026 2:43 PM IST
Gudur
X

Gudur: మామునూరు ఎయిర్‌పోర్టుకు దొడ్డి కొమురయ్య పేరు పెట్టాలి!

Gudur: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో కుల కురుమల సంఘం మండల అధ్యక్షులు ఉపేందర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో కూర్మ సంఘం జిల్లా నాయకులు మండల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మామునూరు ఎయిర్‌పోర్టుకు తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య పేరును నామకరణం చేయాలని గొల్లకురుమ సంఘం జిల్లా అధ్యక్షుడు చీర అశోక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో గొల్లకురుమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ స్వాతంత్య్ర పోరాటంలో దొడ్డి కొమురయ్య చేసిన త్యాగాలు అమూల్యమైనవని, ఆయన పోరాట పటిమ తరతరాలకు గుర్తుండిపోయేలా వరంగల్ (మామునూరు) ఎయిర్‌పోర్టుకు ఆయన పేరు పెట్టడమే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.

తెలంగాణ అమరుల త్యాగాలను చిరస్మరణీయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, వెంటనే ఈ దిశగా నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో గొల్లకురుమ సంఘం నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.

B NARASIMHA, GUDUR

B NARASIMHA, GUDUR