Warangal: భద్రకాళి అమ్మవారి దర్శనం అందరికీ ఉచితంగా కల్పించాలి!
Warangal: వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో టికెట్ దర్శనాలను రద్దు చేసి అందరికీ ఉచిత దర్శనం కల్పించాలి. దేవాదాయ శాఖకు భక్తుడు కనుకుంట రంజిత్ కుమార్ విజ్ఞప్తి.
Warangal: భద్రకాళి అమ్మవారి దర్శనం అందరికీ ఉచితంగా కల్పించాలి!
Warangal: వరంగల్ లోని భద్రకాళి అమ్మవారి దర్శనాన్ని భక్తులందరికీ ఉచితంగా ఏర్పాటు చేయాలని భద్రకాళి అమ్మవారి భక్తుడు కనుకుంట రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలోనే అతి పెద్ద దేవాలయమైన భద్రకాళి ఆలయంలో ఈ నెల 10 నుండి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ధర్మదర్శనంతో పాటు రూ. 50, రూ. 100, రూ. 1500 టికెట్ దర్శనాలను ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై రోజూ లక్షల మంది భక్తులు వచ్చినా మొత్తం ఉచిత దర్శనం ఏర్పాటు చేస్తున్నారని, కానీ భద్రకాళి ఆలయంలో టికెట్ దర్శనాలు పెట్టి అమ్మవారి దర్శనానికి కూడా డబ్బు వసూలు చేయడం సరికాదన్నారు. పవిత్రమైన ఆలయాన్ని వ్యాపార క్షేత్రంగా మారుస్తున్నారని ఆరోపించారు.
ఆలయానికి వచ్చే కోట్ల రూపాయల విరాళాలతోనే ఏర్పాట్లు చేయవచ్చని, ఇలా భక్తులను ఇబ్బంది పెట్టడం సరికాదని అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో దేవాదాయ శాఖకు మంత్రి లేని పరిస్థితిలో ఈ టికెట్ దర్శనం నిర్ణయం ఎవరిది? ఈఓ గారి సొంత నిర్ణయమా? అని ప్రశ్నించారు. దేవాదాయ శాఖ వెంటనే స్పందించి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని అందరికీ ఉచిత దర్శనం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.




