Warangal: వరంగల్‌ను కరువు జిల్లాగా ప్రకటించాలి: కిషన్ రావు

Warangal: ఎల్‌నినో వర్షాభావంతో నష్టపోయిన వరంగల్, హనుమకొండ జిల్లాలను కరువు జిల్లాలుగా ప్రకటించి, పంట రుణాలు మాఫీ చేయాలని రైతు రక్షణ సమితి డిమాండ్ చేసింది.

M PRABHAKAR, PARAKAL
Published on: 27 Oct 2026 5:59 PM IST
Warangal
X

Warangal: వరంగల్‌ను కరువు జిల్లాగా ప్రకటించాలి: కిషన్ రావు

వరంగల్ జిల్లా: రైతుల పంట రుణాలు పూర్తిగా మాఫీ చేయాలి – నష్టపరిహారం తక్షణమే అందించాలి. కలెక్టర్లకు వినతిపత్రం అందజేసిన తెలంగాణ రైతు రక్షణ సమితి నాయకులు.

ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు సరిగా కురవక హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు వరికెల కిషన్ రావు, హనుమకొండ జిల్లా అధ్యక్షులు హింగే భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు.

వర్షాభావంతో భూగర్భ జలాలు అడుగంటిపోయి, సాగునీరు అందక పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని, దిగుబడులు గణనీయంగా తగ్గి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు.

అప్పులు చేసి పెట్టుబడులు పెట్టిన రైతులకు పంటలు చేతికి రాక ఆర్థిక సంక్షోభం ఎదురవుతోందని పేర్కొన్నారు. రైతుల కష్టాలను ప్రభుత్వం తక్షణమే గుర్తించి ఆదుకోవాలని కోరుతూ హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లకు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, హనుమకొండ, వరంగల్ జిల్లాలను కరువు ప్రభావిత జిల్లాలుగా ప్రకటించి,

రైతులు తీసుకున్న పంట రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. వర్షాభావంతో నష్టపోయిన పంటలకు క్షేత్రస్థాయి సర్వే నిర్వహించి తగిన నష్టపరిహారం అందించాలని,

అర్హులైన రైతులకు పంటల బీమా పరిహారం చెల్లించాలని కోరారు. సాగునీటి సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టి రైతులను అప్పుల ఊబి నుంచి బయటపడేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.

రైతులను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు న్యాయం చేయాలని అన్నారు

ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు రక్షణ సమితి జిల్లా నాయకులు సుకినే సుధాకర్ చౌల రామారావు అంబిరి శ్రీనివాస్ బిక్షపతి మాధవరావు పాల్గొన్నారు

M PRABHAKAR, PARAKAL

M PRABHAKAR, PARAKAL