Waddepalli: కార్యకర్తల జోలికొస్తే సహించేది లేదు: దాస్యం విజయ్ భాస్కర్

Waddepalli: బీఆర్ఎస్ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తే ఊరుకునేది లేదని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి మాజీ కార్పొరేటర్ దాస్యం విజయ్ భాస్కర్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 3 Nov 2026 3:30 PM IST
Waddepalli
X

Waddepalli: కార్యకర్తల జోలికొస్తే సహించేది లేదు: దాస్యం విజయ్ భాస్కర్

వడ్డెపల్లి: గత 35 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న ఏనాడూ పదవులను ఆశించలేదు కేవలం ప్రజాసేవలో మరియు కార్యకర్తల కష్టసుఖాల్లో తోడున్న: బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్ దాస్యం విజయ్ భాస్కర్.

వడ్డేపల్లిలోని వారి నివాసంలో శ్రీ దాస్యం విజయ్ భాస్కర్ గారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..

* అయ్యా రాజేందర్ రెడ్డి గారు మీరంటే ఎంతో కొంత సానుభూతి ఉండేది

* దశమ గ్రహం మీ దశ దిశలు మార్చకముందే దారిలో పెట్టుకోండి

* అసలే అనుకోకుండా ఎమ్మెల్యే అయినవ్ మొత్తానికే నిన్ను రాజకీయాలకు కూడా దూరం చేసేలా ఉన్న దరిద్రపు దశమ గ్రహం.

* పశ్చిమ నియోజకవర్గంలో ఇతర పార్టీల నాయకులు మమ్మల్ని రాజకీయంగా విమర్శలు చేసిన వ్యక్తిగతంగా మాతో కలిసిమెలిసి ఉంటారు.

* నువ్వు ఎక్కడోనివో ఇక్కడ మామా పేరు చెప్పి తెర వెనుక ఉండి చిల్లర వేషాలు వేస్తే సహించేది లేదు బిడ్డా.

* మా అన్నలు మంత్రిగా, చీఫ్ విప్ సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా పని చేసినప్పటికీ కూడా నేను ఏనాడు మితిమిరి ప్రవర్తించలేదు.

* చట్టానికి లోబడి ప్రజా సేవే లక్ష్యంగా మమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలకు అండగా ఉన్నాను.

* బిడ్డ అధికారం ఉంది కదా అని అడ్డగోలుగా మా కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తే నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు.

* విజయ భాస్కర్ అంటే ఏందో మీ మామను మీ కాంగ్రెస్ కార్యకర్తలను అడుగు చెప్తారు వాళ్ళు.

* ఒక శాసనసభ్యుడి క్యాంపు కార్యాలయం దగ్గర బీరు బాటిల్ తగి దానిని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విసిరెపించడం నీ చిల్లర తనానికి నిదర్శనం.

* రాజేందర్ రెడ్డి గారు మాట మాట్లాడితే అభివృద్ధి అంటున్నారు మీరు చేసిన అభివృద్ధి కేవలం మేము నిధులు మంజూరు చేసి శంకుస్థాపనలు చేసిన వాటిని ప్రారంభించుకోవడమేనా .

* మీకు దమ్ముంటే చర్చకు రండి మేము చేసిన అభివృద్ధి ఎంతో మీరు చేసిన అభివృద్ధిని ఏంటో తేల్చుకుందాం.

* బిడ్డ దశమ గ్రహం ఇదే నీకు ఫస్ట్ & లాస్ట్ వార్మింగ్ ఇక ముందు అనవసరం నా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల జోలికి వస్తే నీ దశ దిశలు దద్దరిల్లి పోతాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్