Damera: దామెరలో గుర్తుతెలియని వృద్ధురాలు మృతి
Damera: దామెరలో గుర్తుతెలియని వృద్ధురాలి (65) మృతదేహం లభ్యం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. వివరాల కోసం 8712585228 సంప్రదించాలని కోరిన ఎస్ఐ.
Damera: దామెరలో గుర్తుతెలియని వృద్ధురాలు మృతి
దామెర: దామెర గ్రామ శివారులోని శ్లోక స్కూల్ సమీపంలో రోడ్డు పక్కన చెట్ల పొదల వద్ద గుర్తు తెలియని వృద్ధురాలు (సుమారు 65 సంవత్సరాలు) మృతి చెంది ఉన్నట్లు స్థానికులు గుర్తించారు.
విషయం తెలుసుకున్న దామెర పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
మృతురాలి వివరాలు తెలిసిన వారు లేదా ఆమె కుటుంబ సభ్యులు ఎవరైనా వెంటనే దామెర ఎస్ఐ ఈ. వీరభద్రరావు – 8712585228 లేదా దామెర పోలీస్ స్టేషన్ 8712685020 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని దామెర పోలీసులు కోరుతున్నారు.




