Damera: మానవత్వం చాటిన దామెర ఎస్సై వీరభద్రరావు

Damera: దామెర మండలం సింగరాజుపల్లిలో రోడ్డు పక్కన జీవిస్తున్న నిరాశ్రయురాలైన వృద్ధురాలికి ఎస్సై ఈ. వీరభద్రరావు నిత్యావసరాలు, రూ.3 వేల నగదు సాయం అందించి ఆదర్శంగా నిలిచారు.

M PRABHAKAR, PARAKAL
Published on: 26 Oct 2026 2:35 PM IST
Damera
X

Damera: మానవత్వం చాటిన దామెర ఎస్సై వీరభద్రరావు

దామెర: దామెర మండలం సింగరాజుపల్లిలో రోడ్డు పక్కన జీవనం సాగిస్తున్న నిరాశ్రయురాలైన వృద్ధురాలికి దామెర ఎస్సై ఈ. వీరభద్రరావు అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్నారు.

రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో రోడ్డు పక్కన చలిలో పడుకుని ఉన్న వృద్ధురాలిని చూసి చలించిపోయిన ఎస్సై, మరుసటి రోజు ఉదయం మళ్లీ ఆమె వద్దకు వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

ఆమెకు అండగా ఉంటూ బెడ్‌షీట్లు, టవల్స్, పండ్లు, నిత్యావసర సరుకులు, అలాగే రూ. 3 వేల నగదును స్వయంగా అందజేశారు. అంతేకాకుండా అవసరమైన వైద్య సహాయం కూడా అందిస్తానని హామీ ఇచ్చారు.

నిరాశ్రయురాలైన వృద్ధురాలికి సహాయం అందించిన ఎస్సై వీరభద్రరావు మానవతా సేవను గ్రామస్తులు, స్థానికులు అభినందిస్తున్నారు. పోలీసు అంటే కేవలం శాంతిభద్రతలే కాదు, సేవా గుణం కూడా అని నిరూపించారని ప్రశంసిస్తున్నారు.

M PRABHAKAR, PARAKAL

M PRABHAKAR, PARAKAL