Mulugu: తుఫాన్ దెబ్బకు మంగపేటలో కౌలు రైతుకు కన్నీటి కష్టాలు
Mulugu: ములుగు జిల్లా మంగపేట మండలం గంపోనీగూడెంలో డ్రైనేజీలు మూసుకుపోయి 10 ఎకరాల వరి పంట నీటమునిగింది. ఆదుకోవాలని కౌలు రైతు తాటి కమలాకర్ వేడుకుంటున్నారు.
Mulugu: తుఫాన్ దెబ్బకు మంగపేటలో కౌలు రైతుకు కన్నీటి కష్టాలు
ములుగు జిల్లా: ములుగు జిల్లా మంగపేట మండలంలో ఓ కౌలు రైతుకు కన్నీటి కష్టాలు తప్పడం లేదు. తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలకు తోడు డ్రైనేజీ నాళాలు మూసుకుపోవడంతో పది ఎకరాల వరి పంట నీట మునిగి నేలకొరిగింది. రెండు లక్షల కౌలు.. ఐదు లక్షల పెట్టుబడి పెట్టిన రైతుకు ఇప్పుడు కన్నీళ్లే మిగిలాయి. పంటను కాపాడుకునేందుకు మోటార్లతో నీటిని తోడుతూ అష్టకష్టాలు పడుతున్న రైతు ఆవేదనపై ప్రత్యేక కథనం.
ములుగు జిల్లా మంగపేట మండలం గంపోనీగూడెంలో కౌలు రైతు తాటి కమలాకర్ దుస్థితి. పది ఎకరాల సాగుకు రెండు లక్షల కౌలు చెల్లించి.. ఐదు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతుకు పంట చేతికొచ్చే సమయంలో తీరని నష్టం ఎదురైంది.
డ్రైనేజీ నాళాలు మూసుకుపోవడంతో వర్షపు నీరు బయటకు వెళ్లే మార్గం లేక వరి పంట మొత్తం నీట మునిగి నేలకొరిగింది. పంటను కాపాడుకునేందుకు ముగ్గురు కూలీలతో మోటారు ఇంజన్ ద్వారా నీటిని బయటకు పంపుతున్నా.. డీజిల్, కూలీల ఖర్చులు అదనపు భారంగా మారాయి. పలుమార్లు అధికారులకు, మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని రైతు కన్నీటి పర్యంతమయ్యారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించాలి.. క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేయాలి.. మూసుకుపోయిన డ్రైనేజీలను వెంటనే పునరుద్ధరించి ఆదుకోవాలని తాటి కమలాకర్ వేడుకుంటున్నారు.




