Parkal: పరకాలలో కోట్లలో చెక్కుల పంపిణీ: ఎమ్మెల్యే రేవూరి

Parkal: పరకాలలో రూ.1.30 కోట్ల విలువైన సీఎంఆర్ఎఫ్, కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి.. పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

M PRABHAKAR, PARAKAL
Published on: 6 Nov 2026 7:26 PM IST
Parkal
X

Parkal: పరకాలలో కోట్లలో చెక్కుల పంపిణీ: ఎమ్మెల్యే రేవూరి

పరకాల: పరకాల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సీఎంఆర్ఎఫ్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పంపిణీ చేశారు.

పరకాల టౌన్, పరకాల, నడికూడ, ఆత్మకూరు, దామెర, సంగెం, గీసుకొండ మండలాలు, 15, 16, 17వ డివిజన్లకు చెందిన లబ్ధిదారులకు ఈ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ రోజు 53 మంది లబ్ధిదారులకు రూ.53 లక్షల 6 వేల విలువగల కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, 221 మందికి రూ.77 లక్షల 35 వేల విలువగల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశామన్నారు.

ఇప్పటి వరకు నియోజకవర్గ వ్యాప్తంగా 6,841 మంది లబ్ధిదారులకు రూ.47 కోట్ల 94 లక్షల 56 వేల విలువగల చెక్కులను పంపిణీ చేశామని తెలిపారు. పేద ప్రజలకు సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తుందని, ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని విమర్శించారు. తమ ప్రభుత్వం పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరా మహిళా డెయిరీ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ చీరలు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ, రైతు బీమా, సన్న వడ్లకు రూ.500 బోనస్, సన్న బియ్యం పంపిణీ, మహాలక్ష్మి, గ్యాస్ సబ్సిడీ, వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు.

M PRABHAKAR, PARAKAL

M PRABHAKAR, PARAKAL