Jangaon: అక్రమంగా తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలి: పాలకుర్తిలో సీపీఎం ధర్నా!
Jangaon: అక్రమంగా తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలని, సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను తప్పించాలని డిమాండ్ చేస్తూ జనగామ జిల్లా పాలకుర్తిలో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
Jangaon: అక్రమంగా తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలి: పాలకుర్తిలో సీపీఎం ధర్నా!
జనగామ: ఎన్నికల వ్యవస్థను రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ప్రభావితం చేసే ప్రయత్నాలను అడ్డుకోవాలని సిఇసి జ్ఞానేశ్ కుమార్ ను బాధ్యతలనుంచి తప్పించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చిట్యాల సోమన్న, మండల కార్యదర్శి మాచర్ల సారయ్య డిమాండ్ చేశారు. సోమవారం పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు ఐలమ్మ చౌరస్తాలో సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా వారు పాల్గొని మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర సంస్థగా నిష్పక్ష పాతంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు, రాజ్యాంగ సంస్థల స్వతంతను దెబ్బతీసే చర్యలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమన్నారు, ఎన్నికల జాబితాలు ఓటర్ల హక్కులు ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాల విషయంలో ఎన్నికల కమిషన్ ఎలాంటి పక్షపాతానికి తవు లేకుండా వ్యవహరించాలన్నారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ గా ఉన్న జ్ఞానేశ్ కుమార్ వ్యవహార శైలి పై వస్తున్న అభ్యంతరాలను పరిగణంలోకి తీసుకొని ఆయనను బాధ్యతల నుంచి తప్పించాలని ఎన్నికల కమిషన్ పై ప్రజల్లో విశ్వాసం పెంచేలా నిష్పక్షపాత చర్యలు చేపట్టాలని కోరారు, ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించే వారిని కీలక రాజ్యాంగ సంస్థలు నియమించడం వల్ల ప్రజాస్వామ్య వ్యవస్థలపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని దెబ్బతీస్తున్నట్లు వెల్లడించారు.
ఎన్నికల కమిషన్ స్వతంత్రను కాపాడటం ద్వారా ప్రజాస్వామ్యాన్ని ఓటు హక్కును పరిరక్షించాలని ప్రజలను చైతన్యపరిచి ప్రజా ఉద్యమాన్ని చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు సోమసత్యం, మాసంపల్లి నాగయ్య, ఏదునూరి మదార్, బెల్లి సంపత్, కౌడగాని మల్లేష్, పనికిరా భాస్కర్, నాయిని శ్రీను, తాటికాయల జానీ, జక్కుల శోభన్ బాబు, వేల్పుల కొమురయ్య, కాకర్ల పద్మ, తోటరాజు, చిట్యాల సంధ్యారాణి, కోంరమ్మ, బాణాల బాలమ్మ, సోమక్క, పెద్దాపురం, భాష బోయిన కుమార్, ఏ రాజు, బరిగాల పోతన, చెలుకపల్లి సోమయ్య తదితరులు పాల్గొన్నారు.




