Bayyaram: ఘనంగా కామ్రేడ్ ముక్తార్ పాషా ఆరో వర్ధంతి వేడుకలు
Bayyaram: మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో ఘనంగా ముక్తార్ పాషా వర్ధంతి. పాల్గొన్న రాష్ట్ర కార్యదర్శి అశోక్ అన్న, పీడిత ప్రజల కోసం ఆయన చేసిన పోరాటాలు స్మరణ.
Bayyaram: ఘనంగా కామ్రేడ్ ముక్తార్ పాషా ఆరో వర్ధంతి వేడుకలు
బయ్యారం: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేట గ్రామపంచాయతీలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ముస్తార్ పాషా వర్ధంతి సభలు ఘనంగా నిర్వహించారు, ఈ సభకు ముఖ్య అతిథిగా సిపిఐ ఎంఎల్ నూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి అశోక్ అన్న పాల్గొని మాట్లాడుతూ...
కామ్రేడ్ ముక్తార్ పాషా 20 20 సెప్టెంబర్ 24న కరోనా మహమ్మరీ బారినపడి మరణించాడు. ఆ విప్లవ యోధుడు మరణించి ఆరు సంవత్సరాలు కావస్తుంది కామ్రేడ్ పాషా పీడిత ప్రజల విముక్తి కోసం సాగించిన పోరాటం, నిర్మించిన ప్రజా ఉద్యమం, నమ్మిన విప్లవ సిద్ధాంతాలు, ఆశయాలు మాత్రం మన మధ్యనే ఉన్నాయి.
కామ్రేడ్ ముక్తార్ పాషా పార్టీ సిద్ధాంతం, క్రమశిక్షణకు కట్టుబడి జీవితాంతం పీడిత ప్రజల పక్షాన నిలిచిన ఆయన జీవితం నేటి తరానికి శృతిదాయకం.
కామ్రేడ్ పాషా విప్లవ విద్యార్థి ఉద్యమం నుంచి కార్మిక ఉద్యమంలోకి వచ్చి, టైల్స్, రైస్ మిల్, సింగరేణి, హమాలీ, ఇటుక బట్టీ ,భవన నిర్మాణ తదితర రంగాల కార్మికులను సమీకరించారు. యాజమాన్యాల దోపిడి, దౌర్జన్యాల కు వ్యతిరేకంగా కార్మికుల హక్కుల కోసం పోరాడారు.
గోదావరి లోయ ప్రతిఘటన ఉద్యమంలోనూ, ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం వరంగల్ ఏజెన్సీ ఉద్యమంలో నూ ముఖ్య భూమిక పోషించారు. అనేక నిర్బంధాలను ఎదుర్కొని పార్టీని బలోపేతం చేశాడని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా కార్యదర్శి సనప పోమ్మయ్య మహా - బాద్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి భానోత్ ఊఖ్లా.
తెలంగాణ టైల్స్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వైబోగుల శ్రీను . వంగూరి వెంకన్న. సాంబయ్య. పాష. ఎం శేఖర్. పి వై ఎల్ తెలంగాణ రాష్ట్ర నాయకులు భూక్య శివ నాయక్. సర్వయ్య. వెంకన్న. పాపారావు. లక్ష్మయ్య. కుంజ నరసక్క. సాయి రామ్. సక్రు. వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.




